గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర జగ్గయ్యపాలెం క్యాబిన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆళ్ల సత్తిబాబు (45) మృతదేహం మంగళవారం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అతడు మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఉదయం 6.30 గంటల సమయంలో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.