మహిళా పారిశుద్ధ్యం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

1829చూసినవారు
మహిళా పారిశుద్ధ్యం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గాజువాకలోని 64వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులు, ముఖ్యంగా మహిళలు, పని ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారని జివియంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు శ్రామిక మహిళ అధ్యక్షురాలు బత్తిన మీనాక్షికి వినతి పత్రం అందజేశారు. సూపర్వైజర్లు మహిళల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని, డెత్, రిటైర్మెంట్ పోస్టులను భర్తీ చేయాలని, మహిళలకు ప్రత్యేక సమయాల్లో ఉపశమనం కల్పించాలని కోరారు. మీనాక్షి సమస్యలను అర్థం చేసుకుని, ఏఎంఓహెచ్ డాక్టర్ కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్