ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద మాడుగుల నియోజకవర్గంలోని ఎం. కోడూరు గ్రామానికి చెందిన ఐతిరెడ్డి నర్సింమూర్తి అనే యువకునికి ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి ఆదివారం చెక్కును అందజేశారు. నిరుపేద యువకుడైన బాధితుని పరిస్థితిని గ్రామ శాఖ అధ్యక్షులు పోతిన అర్జునరావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఈ సహాయం మంజూరైంది. పేదలకు సహాయం అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐతిరెడ్డి రాము, కర్రి రమణ తదితరులు పాల్గొన్నారు.