జూలై 23 నుంచి దుర్గాలమ్మ పండుగ మహోత్సవం ప్రారంభం

1397చూసినవారు
జూలై 23 నుంచి దుర్గాలమ్మ పండుగ మహోత్సవం ప్రారంభం
అనకాపల్లి, మాడుగుల సమీపంలోని M. కోడూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ దుర్గాలమ్మ తల్లి పండుగ మహోత్సవాన్ని జూలై 23న నిర్వహించాలని ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు ఆదివారం నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు కోలా రాము, కమిటీ సభ్యులు తెలిపారు. జూలై 15న గ్రామ చాటింపు వేసి, 23న తొమ్మిది రోజుల పాటు పండుగ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కమిటీ ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్