రేపు మాడుగులలో 'ఒక నెల-ఒక నియోజకవర్గం'

1669చూసినవారు
రేపు మాడుగులలో 'ఒక నెల-ఒక నియోజకవర్గం'
మాడుగుల పంచాయతీరాజ్ అతిథి గృహంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు 'ఒక నెల - ఒక నియోజకవర్గం' కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజా సమస్యలను నెల రోజుల్లోనే పరిష్కరించడమే దీని లక్ష్యమని కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. ఈ నేపథ్యంలో, సదస్సుకు హాజరయ్యే వివిధ శాఖల అధికారులు అందరూ తప్పనిసరిగా తమ పరిధిలోని పూర్తి రికార్డులతో రావాలని కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించి పరిష్కరించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్