అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని అనకాపల్లి జిల్లా మత్స్య శాఖ అధికారిణి విజయ సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, సముద్ర తీరంలో ఈత కొట్టడాన్ని నిషేధించినట్లు ఆమె పేర్కొన్నారు. మత్స్యకార నాయకులు ఈ విషయాన్ని మత్స్యకారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.