అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది కేజీబీవీలో మంగళవారం ఉదయం ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడకు చెందిన నాగమణి అనే విద్యార్థిని, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. మేడపైన దుస్తులు ఆరేస్తుండగా కాలుజారి కిందపడిపోవడంతో ప్రమాదం జరిగింది. వెంటనే కేజీబీవీ సిబ్బంది ఆమెను 108 అంబులెన్స్‌లో అనకాపల్లికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు.