
విశాఖ ఉత్తర ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
మంగళవారం మొంథా తుఫాన్ కారణంగా తలెత్తిన పరిస్థితులను బీజేపీ ఫ్లోర్ లీడర్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రత్యక్షంగా పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో ఉత్తర నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం, కొండవాలు ప్రాంతాల్లో జారిపడటం, మాధవధార వాంబే కాలనీలో ఇళ్ల పెచ్చులు ఊడిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని పరిశీలించిన అనంతరం, ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

































