స్థానిక హెచ్‌డబ్ల్యూఓలకే ఏటీడబ్ల్యూఓ బాధ్యతలు ఇవ్వాలి

2024చూసినవారు
స్థానిక హెచ్‌డబ్ల్యూఓలకే ఏటీడబ్ల్యూఓ బాధ్యతలు ఇవ్వాలి
అల్లూరి జిల్లాలో జోన్-1కు చెందిన గ్రేడ్-1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లను జోన్-2 పరిధిలోని మండలాలకు ఇన్‌ఛార్జ్ ఏటీడబ్ల్యూఓలుగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ స్టేట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఎస్ఆర్ డివిజన్) ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. జిల్లా పునర్విభజన నేపథ్యంలో స్థానికంగా పనిచేస్తున్న సీనియర్ హెచ్‌డబ్ల్యూఓలను పక్కనపెట్టి ఇతర జోన్ అధికారులకు బాధ్యతలు అప్పగించడం వల్ల స్థానిక అధికారులకు అన్యాయం జరుగుతోందని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న గ్రేడ్-1, సీనియర్ హెచ్‌డబ్ల్యూఓలకే ఇన్‌ఛార్జ్ ఏటీడబ్ల్యూఓ బాధ్యతలు అపగించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్