కరెంట్, తాగునీరు లేక బోయితీలి ప్రజల ఆవేదన

1605చూసినవారు
కరెంట్, తాగునీరు లేక బోయితీలి ప్రజల ఆవేదన
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు పరిధిలోని బోయితీలి, కిల్లంకోట, ఇంజెరి పంచాయతీల ప్రజలు గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తాగునీటికీ కష్టాలు ఎదురవుతున్నాయి. కరెంట్ ఉంటే మోటార్లతో నీటిని తోడుకోవచ్చని, లేదంటే వర్షం నీటిపైనే ఆధారపడాల్సి వస్తుందని గ్రామస్థులు వాపోయారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్