అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, కొత్త వీధి గ్రామానికి రోడ్డు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల కురిసిన వర్షాలతో దారి బురదమయంగా మారి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో
విద్యార్థులు ప్రతిరోజూ సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. గ్రామస్థులు అధికారులకు విజ్ఞప్తి చేసినా, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిబంధనల్లో మార్పుల కారణంగా పనులు చేపట్టడం లేదని చెబుతున్నారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.