దస్తావేజు లేఖరులు పెన్ డౌన్

1630చూసినవారు
దస్తావేజు లేఖరులు పెన్ డౌన్
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దస్తావేజు లేఖర్లు సోమవారం నల్ల బ్యాడ్జీలతో పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటు భాగస్వామ్యం చేస్తున్న జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణతో తమ జీవనోపాధి కోల్పోతామని సంఘ అధ్యక్షుడు లాల గోవిందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిలుపుదల కోసమే జూలై 6, 7 తేదీల్లో పెన్ డౌన్ చేస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాంపు ఫైండర్స్ సతీష్, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్