SIR ప్రక్రియ చేయడంలో నిర్లక్ష్యం వద్దు: ఎంపీడీవో చంద్రశేఖర్

1765చూసినవారు
SIR ప్రక్రియ చేయడంలో నిర్లక్ష్యం వద్దు: ఎంపీడీవో చంద్రశేఖర్
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలంలో SIR ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవో చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలో బిఎల్ఓలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఇంటింటికి తిరిగి సేకరించిన వివరాలను ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. SIR ప్రక్రియ 62% పూర్తయిందని, మిగిలిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్