అరట్లకోటలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 40 వ వర్ధంతి వేడుకలు

1354చూసినవారు
అరట్లకోటలో  డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 40 వ వర్ధంతి వేడుకలు
భారత మాజీ ఉప ప్రధాని, దళిత జనోద్ధారకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు సోమవారం అరట్లకోట ఎస్సీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మార్పీఎస్ మండల గౌరవ అధ్యక్షుడు కుందూరు కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు, డప్పు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్