రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఈనెల 4వ తేదీన నక్కపల్లిలో పర్యటించనున్నట్లు నియోజకవర్గం
టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. మంత్రి తన పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. ఉదయం 7 గంటలకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి మంత్రి పూలమాలవేసి నివాళులు అర్పిస్తారని పేర్కొన్నారు.