ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో
జనసేన నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అతనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదులో
జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గెడ్డం బుజ్జి, గెడ్డం చైతన్య, జగ్గన్న దొర, మండల అధ్యక్షుడు యాగదాసు నానాజీ తదితరులు పాల్గొన్నారు.