కొడవటిపూడిలో కార్డు గేమ్స్ ఆడుతున్న ఏడుగురి అరెస్ట్

1501చూసినవారు
కొడవటిపూడిలో కార్డు గేమ్స్ ఆడుతున్న ఏడుగురి అరెస్ట్
అనకాపల్లి జిల్లా కోటఉరట్ల మండలం కొడవటిపూడి గ్రామంలో శనివారం రాత్రి గుట్టు చప్పుడు కాకుండా కార్డు గేమ్స్ ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను కోటఉరట్ల ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు రెడ్ హ్యాండెడే గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2400 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండల పరిధిలో జూథాలు, కోడిపందాలు, కార్డు ఆటలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్