పెండెం దొరబాబుకు దరఖాస్తు అందజేసిన తుమ్మల శ్యాం కిషోర్

1192చూసినవారు
పెండెం దొరబాబుకు దరఖాస్తు అందజేసిన తుమ్మల శ్యాం కిషోర్
జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి చేపట్టిన నిర్మాణ కమిటీల ఏర్పాటులో భాగంగా, అనకాపల్లి పార్లమెంట్ నిర్మాణ సారథుల కమిటీ సభ్యుడు తుమ్మల శ్యాం కిషోర్ తన దరఖాస్తును అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ నిర్మాణ సారథుల అధ్యక్షుడు, పెండం దొరబాబుకు స్వయంగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల శ్యాం కిషోర్ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి కార్యకర్తకు నాయకత్వ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్మాణ సారథుల కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. సామాన్య కార్యకర్తలను సైతం నాయకులుగా తీర్చిదిద్దే దిశగా పార్టీ ముందుకు సాగడం శుభపరిణామమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్