మేఘాద్రిగడ్డ డ్యాం వద్ద బాలుడి మృతి

394చూసినవారు
మేఘాద్రిగడ్డ డ్యాం వద్ద బాలుడి మృతి
శనివారం పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేఘాద్రిగడ్డ డ్యాం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్త గాజువాక RTC డిపో ప్రాంతానికి చెందిన 9 మంది యువకులు ఈతకు వెళ్లగా, డ్యాం గేట్ల కింద మునిగిపోయారు. ఈ దుర్ఘటనలో వెల్దుర్తి పవన్ కుమార్ (16) అనే యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. అదృష్టవశాత్తు, మిగిలిన 8 మంది యువకులు ప్రాణాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్