సబ్బవరం: తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 80 కోట్లు

53చూసినవారు
సబ్బవరం: తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 80 కోట్లు
అనకాపల్లి జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు 15వ ఆర్థిక సంఘం నుంచి 80 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు విశాఖ జడ్పి సీఈవో నారాయణమూర్తి తెలిపారు. గురువారం సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో మాట్లాడుతూ మండలంలో అన్ని పంచాయతీల్లో జల్ జీవన్ మిషన్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్