రంపచోడవరం మండలంలో 16 అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. చిన్నయ్యపాలెం, జడ్డంగి - 4, మంగంపాడు, కిర్రాబు కాలనీ, సీతారామపురం, నెల్లిమెట్ల కాలనీ, డి. మల్లవరం, సింగంపల్లి రోడ్, సుబ్బంపాడు, కన్నయ్యమ్మపేట, కొత్తవీధి, వయ్యాడ, బొరుగుపల్లి, శ్రీరామనగర్, లక్కవరప్పాడు, కిండ్ర కాలనీ గ్రామాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుదారులు ఆయా గ్రామాలకు చెందినవారై, గిరిజన మహిళలై ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, 21 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. ఆధార్, రేషన్, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తులను కార్యాలయంలో సమర్పించాలి.