రంపచోడవరంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా బుధవారం వన్ స్టాప్ సెంటర్ (OSC)లో గర్భిణీలు, బాలింతలకు జిల్లా పి. డి. ఉమా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తల్లి-శిశు ఆరోగ్యం, పోషకాహారం, తొలి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ఉమా అవగాహన కల్పించారు. తల్లి పాలు ఇచ్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను కూడా ఆమె వివరించారు.