రంపచోడవరంలో శుక్రవారం ఎన్నికల అధికారి ప్రశాంత్ కుమార్ అధ్యక్షతన బీఎల్‌ఓలు, బీఎల్‌ఏల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ప్రతి ఒక్కరూ తమ ఫారాలను నింపి బీఎల్‌ఓలకు అందజేయాలని, అలాగే (SIR. ) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బీఎల్‌ఓలకు సహకరించాలని ఆయన కోరారు. ఓటర్ నమోదు ప్రక్రియలో కూడా సహాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి నుండి బూత్ కన్వీనర్ నల్లమిల్లి సుబ్బారెడ్డి, బూత్ ఎజెంట్లు కాసగనా సురేష్ గౌడ్, గొల్లపూడి జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.