జామాయిల్ తోట పనికి వెళ్లి గుండెపోటుతో మృతి

1391చూసినవారు
జామాయిల్ తోట పనికి వెళ్లి గుండెపోటుతో మృతి
రాజవొమ్మంగి మండలం కొండలింగంపర్తి గ్రామానికి చెందిన దబ్బా బుజ్జిబాబు (45) ఏలూరు జిల్లా చింతలపూడి మండలం గోకవరం గ్రామంలో జామాయిల్ తోట పనికి వెళ్ళాడు. జూన్ 30న గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. కుటుంబ యజమాని మరణంతో నిరుపేద కుటుంబం అగమ్యగోచరంగా మారింది. ఆయనకు భార్య బేబీ, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. జీవనోపాధి కోసం వలస వెళ్లి గుండెపోటుతో మృతి చెందిన బుజ్జిబాబు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్