జనసేన నేత ఎమ్మెల్సీ కొణిదల
నాగబాబు ఈనెల 4, 5 తేదీలలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్కా రెసిడెన్సీలో సమావేశం నిర్వహించి, నియోజకవర్గంలో బూత్ కమిటీలతో పాటు అన్ని పదవులకు ఆశించే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కుర్ల రాజశేఖర్ రెడ్డి ఈ విషయాన్ని శుక్రవారం తెలిపారు. సమాచార సేకరణ కమిటీ సభ్యులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు హాజరై దరఖాస్తు చేసుకోవాలని కోరారు.