రాజవొమ్మంగి మండలంలో వెలుగు ఏపీఎం గా లక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె శ్రీకాకుళం నుండి బదిలీపై వచ్చారు. ఇంతకుముందు పనిచేసిన ఏపీఎం మధు రంపచోడవరం వెళ్లారు. ఈ మార్పుతో రాజవొమ్మంగి మండలంలో కేవలం ఇరవై రోజుల్లో ముగ్గురు ఏపీఎంలు మారినట్లు సమాచారం. వెలుగు సిబ్బంది నూతన ఏపీఎం లక్ష్మిని కలిసి పరిచయం చేసుకొన్నారు.