రాజవొమ్మంగి మండలంలో జనసేన పదవులకు కొత్తవారికి అవకాశం

1472చూసినవారు
రాజవొమ్మంగి మండలంలో జనసేన పదవులకు  కొత్తవారికి అవకాశం
రాజవొమ్మంగి మండలంలో జనసేన పార్టీ కోసం పనిచేసిన వారికి నూతనంగా పదవుల కోసం అర్జీ చేసుకునే అవకాశం వచ్చిందని జనసేన అరకు పార్లమెంట్ సమాచార సేకరణ సభ్యులు పళ్ళా అప్పారావు తెలిపారు. ఈనెల 4, 5 తేదీల్లో రంపచోడవరం జిల్లా కేంద్రానికి అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు వస్తున్నారని, వారికే నేరుగా అర్జీలు ఇచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నాగబాబును కలిసి రాజవొమ్మంగి మండలంలో జనసేన పార్టీ పరిస్థితులను వివరించినట్లు అప్పారావు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్