పోలవరం: పులి భయం.. తగ్గిన పర్యాటకులు

1755చూసినవారు
దేవీపట్నం మండలంలో పులి సంచారం కారణంగా పర్యాటకం, ఆలయాలపై తీవ్ర ప్రభావం పడింది. మంగళవారం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. అదే విధంగా పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. విహారయాత్రకు కేవలం ఒక పర్యాటక బోటులో 42 మంది పర్యాటకులు మాత్రమే వెళ్లారు. పులి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్