మారేడుమిల్లిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

1347చూసినవారు
మారేడుమిల్లిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల వల్ల కరెంటు పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తెగిపోయాయి. విద్యుత్ అధికారులు, సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు ఆదివారం  తెలిపారు. ప్రజలు విద్యుత్ పోల్స్, తీగలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్