రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండలం బడదనాంపల్లి పంచాయితీ రాజుపేట రోడ్డు కొద్దిపాటి వర్షానికే నడవలేని స్థితికి చేరుకుంది. ఈ రహదారి అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని గ్రామాలకు తక్కువ దూరంలో గమ్యం చేరడానికి కీలకమైనది. రహదారి సమస్యను పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మండల
టీడీపీ అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు తెలిపారు.