దండోరా ఉద్యమ స్ఫూర్తి చిరస్థాయిగా నిలవాలి

1550చూసినవారు
దండోరా ఉద్యమ స్ఫూర్తి చిరస్థాయిగా నిలవాలి
రాజవొమ్మంగి ఎస్సీ పేట అంబేద్కర్ నగర్‌లో ఎమ్మార్పీఎస్ దండోరా ఉద్యమం 32 ఏళ్లు పూర్తైన సందర్భంగా జెండా ఆవిష్కరణతో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మోర్త బుజ్జిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన ఉద్యమం తరతరాలకు స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్