రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేటలో బుధవారం, ఆగస్టు 5న వ్యవసాయ శాఖ, ఆత్మ సంయుక్తంగా ఎల్‌నినో ప్రభావంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా KVK శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ బాబు ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ కాల వ్యవధి వరి రకాలు, పప్పు పంటలు సాగు చేయాలని సూచించారు. RARS శాస్త్రవేత్త డా. జోగారావు వరి పంటలో ఎరువులు, జీవ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించగా, ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ పుష్పవతి జీడి, మామిడి పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏ. ఓ. లు, VAAలు, APCNF సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.