గిరిజన పాఠశాల హెచ్‌ఎం వీడ్కోలు: పూర్వ విద్యార్థుల ఘన సన్మానం

1433చూసినవారు
గిరిజన పాఠశాల హెచ్‌ఎం వీడ్కోలు: పూర్వ విద్యార్థుల ఘన సన్మానం
రాజవొమ్మంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం ఎం. రాజ్ దినకరన్ (జూన్ 30) ఉద్యోగ విరమణ సందర్భంగా, 2001-02 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన బోర్నగూడెం ఆశ్రమ పాఠశాల పూర్వ విద్యార్థులు గురుదంపతులను ఘనంగా సన్మానించారు. బహుమతులు అందజేసి, గురువుల ఆశీస్సులను పొందారు. 25 ఏళ్ల క్రితం వారి పాఠశాలలో గడిపిన అనుభవాలను పూర్వ విద్యార్థులు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.

సంబంధిత పోస్ట్