మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - ఎస్. ఐ. చినబాబు

1449చూసినవారు
మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - ఎస్. ఐ. చినబాబు
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలం కరుదేవపాలెం గ్రామంలో శుక్రవారం మహిళలపై జరిగే నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్.ఐ. చినబాబు మాట్లాడుతూ, మహిళలపై వేధింపులు, గృహహింస, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలపై వివరించారు. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వారి భద్రత కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్