
విశాఖ: జీవీఎంసీకి జాతీయ స్థాయిలో మూడు అవార్డులు
దేశవ్యాప్తంగా పట్టణ సంస్థల పనితీరుపై నిర్వహించిన అధ్యయనంలో జీవీఎంసీకి జాతీయ స్థాయిలో మూడు అవార్డులు దక్కాయి. నగరవాసులకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి పనులను సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు ‘బెస్ట్ సోషల్ మీడియా క్యాంపెయిన్’లో ప్రథమ బహుమతి, మహిళల ఆర్థిక స్వావలంబనకు తీసుకుంటున్న చర్యలకు ‘ఉమెన్ ఎంపవర్‌మెంట్’లో ద్వితీయ బహుమతి, ఐదేళ్లలోపు పిల్లల సృజనాత్మక అభివృద్ధికి చేపట్టిన ‘బాల్యం’ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి లభించాయి. ఈ అవార్డులను ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో జరిగే కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి స్వీకరించనున్నారు.






















