విశాఖలో 3.50 కిలోల గంజాయి పట్టివేత, ఒకరి అరెస్ట్

940చూసినవారు
విశాఖలో 3.50 కిలోల గంజాయి పట్టివేత, ఒకరి అరెస్ట్
విశాఖపట్నం, దక్షిణ విశాఖలో సోమవారం, 29 జూన్ 2026న, కమిషనర్ ఆఫ్ పోలీస్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, ఆర్.ఐ (సెక్యూరిటీ వింగ్) ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో పెందుర్తి రైల్వే స్టేషన్ పరిసరాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో 3.50 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యల కోసం పెందుర్తి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్