విశాఖలో పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వచ్చి యువకుడు అదృశ్యం

672చూసినవారు
విశాఖలో పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వచ్చి యువకుడు అదృశ్యం
విశాఖపట్నం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, కడప రాజంపేటకు చెందిన బి.వెంకట శివకుమార్ అనే యువకుడు పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వచ్చినప్పుడు అదృశ్యమయ్యాడు. ఈ నెల 23న తన మేనమామతో కలిసి విశాఖ చేరుకున్న శివకుమార్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భోజనం చేస్తున్న సమయంలో చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు. మతిస్థిమితం సరిగా లేని యువకుడి తండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్