ఉపాధి హామీ పథకం రద్దుపై సీఐటీయూ ఆందోళన

1987చూసినవారు
ఉపాధి హామీ పథకం రద్దుపై సీఐటీయూ ఆందోళన
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని, దాని స్థానంలో ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవక మిషన్'ను రద్దు చేయాలని సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మద్దిలపాలెం జంక్షన్లో బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి. కుమార్ మాట్లాడుతూ యూపీఏ వన్ ప్రభుత్వం 2006లో ఈ పథకాన్ని సాధించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్