రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

398చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జీవీఎంసీ 13వ వార్డు శ్రీ కృష్ణాపురంలో శనివారంజరిగిన రోడ్డు ప్రమాదంలో గుబ్బల మహేశ్ (37) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. హనుమంతవాక నుంచి సింహాచలం వైపు బైక్‌పై వెళ్తుండగా చెట్టు కొమ్మ తగలడంతో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్