గుంతతో పొంచి ఉన్న ప్రమాదం

27చూసినవారు
గుంతతో పొంచి ఉన్న ప్రమాదం
విశాఖ జీవీఎంసీ 58వ వార్డు శ్రీహరిపురం ప్రధాన మార్గంలో భూగర్భ విద్యుత్ పనుల కోసం 15 రోజుల క్రితం తవ్విన గుంతను పూడ్చకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు ఆడుకుంటూ అందులో పడిపోతున్నారని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్