భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో కలిసి పాండ్రంగిలో భరతమాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, ఆచారాలను కాపాడుకోవడం నేటి తరం బాధ్యతగా భావించాలని అన్నారు.