విశాఖ: వేటకు వెళ్లి యువకుడి మృతి

481చూసినవారు
విశాఖ: వేటకు వెళ్లి యువకుడి మృతి
విశాఖ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాలరిపేటకు చెందిన రాముళ్ల నూకరాజు (29) శనివారం చేపల వేటకు వెళ్లి సముద్రంలో పడి మృతి చెందాడు. తెల్లవారుజామున వేటకు వెళ్లినప్పుడు తెరచాప తగిలి అతను నీటిలో పడిపోయినట్లు సమాచారం. అనంతరం అతని మృతదేహాన్ని నేవల్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న బీచ్ ఒడ్డుకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు.

సంబంధిత పోస్ట్