తగరపువలస సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ధరన్‌శ్రీ అనే విద్యార్థి ఆదివారం అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విజయనగరం జిల్లా వేపాడ మండలం సోంపురానికి చెందిన ధరన్, స్నేహితులను కలుసుకునేందుకు హాస్టల్ నుంచి బయటికి వెళ్లి ప్రమాదానికి గురైనట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.