ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు సోమవారం విశాఖ జీవీఎంసీ సమీపంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.