విశాఖపట్నంలో గురువారం జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. 'నో సీట్ టూ వన్ సీట్, వన్ సీట్ టూ 100శాతం స్ట్రైక్ రేట్ సాధించేలా జనసేన బలంగా నిలబడింది' అని ఆయన అన్నారు. జనసేన ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ, సైద్ధాంతికంగా బలమైన జాతీయవాదం ఉందని ఆయన పేర్కొన్నారు.