విశాఖపట్నంలో ఓ పోలీసు కానిస్టేబుల్ నిజాయితీని చాటుకున్నారు. ఆదివారం సాయంత్రం పోలీసు బ్యారెక్స్ వద్ద సెల్‌ఫోన్, పర్సు పోగొట్టుకున్న యువతికి, అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాంబాబు వాటిని గుర్తించి ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం సహాయంతో బాధితురాలికి అందజేశారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించడంతో యువతి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.