విశాఖ మేయర్ పై కుర్చీ ఎత్తిన వైకాపా కార్పొరేటర్

100చూసినవారు
విశాఖ మేయర్ పై కుర్చీ ఎత్తిన వైకాపా కార్పొరేటర్
విశాఖ నగర పాలక సంస్థలో తీవ్ర కలకలం రేగింది. మేయర్ పీలా శ్రీనివాసరావుపై వైకాపా కార్పొరేటర్ బిపిన్ జైన్, ఫ్లోర్ లీడర్ బాణాల, డిప్యూటీ మేయర్ సతీష్ దురుసుగా ప్రవర్తించారు. మేయర్ పై కుర్చీ ఎత్తారు. ఈ ఘటనతో ఆగ్రహించిన మేయర్, దాడికి పాల్పడిన ముగ్గురినీ సస్పెండ్ చేశారు. ఈ దాడి వెనుక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారని మేయర్ పీలా శ్రీనివాసరావు ఆరోపించారు. పోడియం మీదకు దూకి దాడి చేశారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్