Jan 12, 2026, 17:01 IST/
పండుగ వేళ పెరిగిన వంట నూనెల ధరలు
Jan 12, 2026, 17:01 IST
సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత పదిహేను రోజుల వ్యవధిలో లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర రూ.5 వరకు పెరిగింది. దసరా పండుగ సమయంలో ఉన్న రేట్లతో పోలిస్తే ఇది రెట్టింపు. ప్రస్తుతం లీటర్కు రూ.10 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. డిమాండ్ పెరుగుదలతో కొందరు వ్యాపారులు కావాలనే రేట్లు పెంచుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వేరుశనగ, రైస్ బ్రాన్, సోయాబీన్ వంటి దేశీయ నూనెల ధరల్లో పెద్దగా మార్పు లేదు.