
బెల్లంకొండ శ్రీనివాస్ రాకతో అభిమానుల్లో ఆనందం
ఈ నెల 19వ తేదీన శ్రీ అనంత పద్మనాభస్వామి వారి కోటి దీపోత్సవం సందర్భంగా, మాజీ ఎంపీపీ నగేష్ కుమార్ పిలుపు మేరకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పద్మనాభం రానున్నారు. బుధవారం సాయంత్రం 5:00 గంటలకు దీపారాధన కార్యక్రమంలో పాల్గొని, శ్రీ కుంతి మాధవి స్వామి వారిని దర్శించుకోనున్నారు. యువ హీరో రాకతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




































