
తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే వంశీకృష్ణ
పేదలకు సంబంధించిన స్థలం విషయంలో మంత్రికి లేఖ రాసినట్లు, దీనికి వైసీపీనే కారణమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ హయాంలో పేదల స్థలంలో జీవీఎంసీ నిర్మాణాలు చేసిందని, ఈ విషయంపై తాను స్పందించానని చెప్పారు. తాను తప్పులు చేసినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే అరగంటలో రాజీనామా చేస్తానని ఆయన శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో సవాల్ విసిరారు.








































